ETV Bharat / state

నేతన్నల బతుకుల్లో కరోనా కల్లోలం - guntur district weavers news

కరోనా వైరస్ విజృంభనతో నేతన్నలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. మొదటి దశ కరోనా నుంచి కోలుకోక ముందే రెండో దశ విజృంభనతో సంక్షోభంలో చిక్కుకున్నారు. నెలకు రూ.8వేలు సంపాదించే చేనేత కార్మికుడు నేడు రూ.2,500 కూడా ఆదాయం పొందలేని పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 22,150 మంది కార్మికుల జీవన స్థితి ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది

Weaving loom
నేత మగ్గం
author img

By

Published : May 3, 2021, 11:22 AM IST

కరోనా కల్లోలంతో చేనేత కార్మికులు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి నగరంతో పాటు 13 కేంద్రాల్లో చేనేత వృత్తిదారులు జీవిస్తున్నారు. అంతర్జాతీయంగా చేనేత వస్త్రాల ఎగుమతికి మంగళగిరి నగరం కేంద్రంగా ఉంది. గత ఏడాది కొవిడ్‌-19 వల్ల చేనేత పరిశ్రమ కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం రెందో దశ కరోనా విజృంభణతో కార్మికుల జీవనంపై మళ్లీ తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది జనవరి నుంచి కొద్దిగా ఉత్పత్తి ప్రారంభమై చేనేత కార్మికుల జీవనం కొద్దిగా మెరుగుపడింది. ఉన్నట్టుండి ఏప్రిల్‌ నుంచి పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఉత్పత్తులు అమ్ముడు పోవడం లేదు. వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వేలాది మంది కార్మికులు రోజువారీ పని లేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
ఉత్పత్తిదారులు వస్త్ర తయారీ తగ్గించి వేశారు. మగ్గంపై వస్త్ర ఉత్పత్తి చేసి నెలకు రూ.8 వేలు సంపాదించే చేనేత కార్మికుడు ఇప్పుడు రూ.2,500 కూడా ఆదాయం పొందలేని పరిస్థితి నెలకొంది. ఇంటి అద్దె చెల్లించలేక, కుటుంబ పోషణ కష్టమై ఇబ్బంది పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. ఒక్క మంగళగిరిలోనే 4,500 మంది చేనేత కార్మికులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 22,150 మంది కార్మికులు మగ్గాలపై పనిచేస్తున్నారు. వారి జీవన స్థితి ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది.

స్తంభించిన విక్రయాలు:

కొవిడ్‌ పరిస్థితులతో జిల్లా వ్యాప్తంగా చేనేత వస్త్ర విక్రయాలు నిలిచి పోయాయి. ఉదయం 11 గంటలకే దుకాణాలు మూసి వేస్తున్నారు. సాధారణంగా విజయవాడ, ఇతర దూరప్రాంతాల నుంచి వచ్చి మంగళగిరిలో చేనేత చీరలు, డ్రెస్‌మెటీరియల్‌ కొనుగోలు చేసి వెళ్తుంటారు. రోజూ సగటున రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఉత్పత్తి అయిన వస్త్రాలు విక్రయాలు జరగటం లేదు. ఒక్క నెలలోనే రూ.5 కోట్లకు పైగా విలువైన నిల్వలు పేరుకుపోయాయి. కార్మికులకు ఉపాధి చూపలేని స్థితిలో ఉత్పత్తిదారులున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం
మగ్గంపై నెలకు 5 పచ్చాలు (15 నుంచి 20 చీరలు) నేస్తాను. రూ.8 వేల నుంచి రూ.8,500 ఆదాయం వచ్చేది. ఈ నెల కేవలం రూ.2 వేలు మించి ఆదాయం రాలేదు. ఆర్థికంగా ఇబ్బందిలో పడ్డాను. - దుర్గారావు, చేనేత కార్మికుడు
విక్రయాలు లేవు
కరోనా పరిస్థితుల వల్ల మరోసారి చేనేత ఉత్పత్తి నిలిచింది. కార్మికులకు ఉపాధి చూపలేక పోతున్నాం. విక్రయాలు లేనందున కష్టాలు పడాల్సి వస్తోంది. - లక్ష్మణరావు, ఉత్పత్తిదారుడు

ఇదీ చదవండి

అన్నదాతలకు తీపి కబురు.. ఆ గోదాముల్లో ధాన్యం నిల్వకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.