ETV Bharat / state

381వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

author img

By

Published : Jan 1, 2021, 5:28 PM IST

రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 381వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఐనవోలు, ఉద్ధండరాయునిపాలెం, ఆనంతవరం తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

Concern of capital farmers reaching 381st day
381వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. రైతులు చేపట్టిన ఆందోళనలు 381వ రోజు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఐనవోలు, అనంతవరం, పెదపరిమి, కృష్ణాయపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. నూతన సంవత్సరం వేడుకలను దీక్షా శిబిరాలలోనే నిర్వహించారు. మందడం, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు దీక్షా శిబిరాలలో కేక్ కట్ చేశారు. ఉద్ధండరాయునిపాలెంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమకు న్యాయం జరగాలంటే జస్టిస్ రాకేష్ కుమార్ వ్యక్తిత్వం ఉన్న న్యాయమూర్తులే హైకోర్టుకు రావాలని రైతులు, మహిళలు ప్రార్థనలు చేశారు. రోడ్డుపై నిలబడి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

ఆలయాల్లో భక్తుల సందడి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.