
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా ప్రజలలో మరింత చైతన్యం తీసుకురావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామ సచివాలయన్నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందుతున్న సేవలను పరిశీలించారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది మాస్కులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాలలో సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు. నిర్ధేశించిన సమయానికి ప్రజల నుంచి వచ్చే అర్జీల సమస్యలను పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉంచితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేయాలని కోరగా వ్యవసాయ శాఖ పంట నమోదు సమయంలోనే ఆ ప్రక్రియను చేయించుకోవాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
ఇవీ చదవండి