పేదల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకాన్ని తీసుకొస్తోంది. రాష్ట్రంలో రైస్ కార్డున్న 1.41 కోట్ల కుటుంబాలకు లిబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తరఫున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం 510 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
18 నుంచి 50 ఏళ్ల వయసున్న లబ్ధిదారులు సహజ మరణం పొందితే 2 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వత వైకల్యం కలిగినా 5 లక్షల రూపాయల బీమా పరిహారం నామినీకి అందిస్తారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం కలిగినా 3 లక్షల రూపాయలు ఇస్తారు. 18- 70 ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవశాత్తూ పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం పొందితే 1.50 లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తారు. ప్రమాదం జరిగిన 15 రోజుల్లోగా బీమా మొత్తాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది.
ఇదీ చదవండి