ETV Bharat / state

15న నరసరావుపేటలో కామధేను పూజ... పాల్గొననున్న సీఎం జగన్ - కామధేను పూజ తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు. తితిదే ఆధ్వర్యంలో జరగనున్న కామధేను పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ బుధవారం పరిశీలించారు.

CM jagan
CM jagan
author img

By

Published : Jan 13, 2021, 6:53 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 15న గుంటూరు జిల్లా నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న క్రీడా మైదానంలో కామధేను పూజ నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ బుధవారం పరిశీలించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు.

అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కామధేను పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ... తితిదే ఈ పూజా కార్యక్రమాన్ని నరసరావుపేటలో నిర్వహించడం నియోజకవర్గ ప్రజలకు మహాభాగ్యంగా భావిస్తున్నామన్నారు. సుమారు గంటపాటు పూజ కొనసాగుతుందని తెలిపారు.

ఇదీ చదవండి

ఆలయాలపై దాడుల ఘటనల్లో.. 335 మంది అరెస్ట్: రాష్ట్ర డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.