ETV Bharat / state

కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి - కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్

గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేన్సర్ ఆసుపత్రిని ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అధునాతన పరికరాలతో నాట్కో ఫార్మా లిమిటెడ్ ట్రస్టు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్

author img

By

Published : Jun 30, 2020, 10:57 PM IST

Updated : Jul 1, 2020, 7:12 AM IST

గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేన్సర్ ఆసుపత్రిని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. నాట్కో ఫార్మా లిమిటెడ్ ట్రస్టు, రాష్ట్రప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దీంతో జీజీహెచ్​లో ఇకనుంచి కేన్సర్​కు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. నాట్కో సంస్థ 30 కోట్లు, ప్రభుత్వం తరపున 19 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో లేనివిధంగా 100 పడకలు కేన్సర్ రోగులకు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన కొన్ని అత్యాధునిక కేన్సర్ నిర్ధరణ పరీక్షలు జీజీహెచ్​లో అందుబాటులోకి రానున్నాయి.

రేడియేషన్ థెరపీ ఇచ్చేందుకు అంత్యంత ఆధునిక యంత్రం లీనియర్ యాక్సిలేటర్​ను ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ.... స్విట్జర్లాండ్ నుంచి 13 కోట్ల వ్యయంతో తెప్పించింది. ఇప్పటికే నాలుగు అత్యున్నత వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని యంత్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్​లో కేన్సర్ చికిత్సకు అధునాతన సదుపాయాలతో ఆస్పత్రి లేకపోవడం రోగులకు సమస్యగా ఉండేది.

ఇపుడు ఏర్పాటైన కేన్సర్ విభాగం నుంచి రాష్ట్రంలోని రోగులకు అత్యున్నత వైద్యం అందనుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. కేన్సర్ ఆస్పత్రి నిర్మాణంతో రేడియేషన్ అంకాలజీ వంటి పీజీ కోర్సులు ప్రారంభించడానికి అనుమతి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఆన్​లైన్ ద్వారా ఈ ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు.

ఇదీ చదవండి: విషవాయువు లీకేజీ ఘటనలో గుంటూరు వాసి దుర్మరణం

Last Updated : Jul 1, 2020, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.