రాజధాని అమరావతిని పరిరక్షించాలంటూ రాయపూడి వద్ద రాజధాని రైతులు, మహిళలు కృష్ణా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దొండపాడుకు చెందిన మహిళలు పసుపు, కుంకుమలు కృష్ణమ్మకు సమర్పించి మంగళహారతులు ఇచ్చారు. రాజధాని అమరావతి ముంపు ప్రాంతం కాదని, మరోసారి పునరుద్ఘటించారు.
తుళ్లూరులో మహిళలు, భూములిచ్చిన రైతులు... కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభత్వం నిర్ణయం మార్చుకునేంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.