గుంటూరులోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత.. రఘునాథ్‌బాబు మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తే సమర్దవంతంగా నడుస్తుందని.. హై క్వాలిటీ స్టీల్ పెట్టేందుకు విశాఖలో అనువైన స్థలం అని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థలాన్ని అమ్ముకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చంద్రబాబు, జగన్ ఇద్దరు అనుకూలమే అని అన్నారు. ప్రైవేటు సంస్థలు విజయవంతంగా నడుస్తున్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరిస్తే మరింత విజయవంతంగా నడుస్తుందని చెప్పుకొచ్చారు.
అమరావతిలో మహిళలు, రైతులు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును.. రఘునాథ్‌బాబు తప్పుపట్టారు. దేశ రాజధానిలో జాతీయ జెండా స్థానంలో మరో జెండా ఎగరవేసినా.. పోలీసులు సమన్వయం పాటించి వారిని అదుపు చేశారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో రైతులు, మహిళలు పైన పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున మహిళలు పైన దాడులు చేయడం నిర్బంధించడం బాధాకరమన్నారు.
ఇదీ చదవండీ.. ఎన్నికల కారణంగా వ్యక్తిగత పర్యటన వాయిదా వేసుకున్న ఎస్ఈసీ