ETV Bharat / state

బాలల పండుగ బాలోత్సవ్ వచ్చేసింది..!

author img

By

Published : Nov 29, 2019, 6:07 AM IST

పిల్లలు.. విరిసిన మల్లెలు. గలగల సెలయేరులా.... పిల్లలు ఆడుతూ, పాడుతూ ఉంటే మురిసిపోని వారుండరు. ఇదే లక్ష్యంతో ఏటా విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని, పోటీతత్వాన్ని నింపుతోంది బాలోత్సవ్. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బాలోత్సవ్ 2019 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

Balostav 2019 at guntur vvit
బాలల పండుగ బాలోత్సవ్ వచ్చేసింది..!

బాలల పండుగ బాలోత్సవ్ వచ్చేసింది..!

బాలోత్సవ్-2019 కార్యక్రమానికి గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల మరోసారి వేదికైంది. వేలాదిమంది విద్యార్థుల ఆటపాటలు, కేరింతలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలతో మార్మోగింది. పిల్లల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేలా 1991లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వాసిరెడ్డి రమేశ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్రప్రదేశ్​లో గుంటూరు శివారు వీవీఐటీ కళాశాలలో ఈ పోటీలు ఏటా జరుగుతున్నాయి. ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ వెంకట్.. బాలోత్సవ్ 2019 పోటీలు ప్రారంభించగా.. బాలోత్సవ్ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి రమేష్, వీవీఐటీ ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 20 అంశాల్లో 54 విభాగాల్లో విద్యార్థులు పోటీపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12వేల మంది విద్యార్థులు ఈ వేడుకకు తరలివచ్చారు. వారితో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రాకతో బాలోత్సవ్ 2019 కార్యక్రమానికి వేదికైన వీవీఐటీ ప్రాంగణం కిటకిటలాడుతోంది. చదువు, మార్కుల ఒత్తిడితో సతమతమవుతున్న విద్యార్థులు సేదతీరేందుకు ఇదో మంచి అవకాశమని కార్యక్రమానికి హాజరైన వారు అభిప్రాయపడ్డారు.

ప్రతిభ కనబరిచేందుకు ఓ అవకాశం

ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీపట్టే పిల్లలు స్వేచ్ఛగా తమకు నచ్చినరంగాల్లో ప్రతిభను చూపేందుకు పోటీపడ్డారు. చిత్రలేఖనంతో కొందరు చిత్తరువులు రూపొందించగా.. సినీ, జానపద, లలిత గీతాలు పాడి మరికొందరు అలరించారు. తెలుగు పద్యాల పఠనం, కవితా రచన, కథా రచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు మాతృభాష పరిరక్షణకు తాము సైతం అంటూ ముందుకు వచ్చారు. శాస్త్రీయ సంగీతం, కూచిపూడి, భరత నాట్యం అంశాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ, విచిత్ర వేషధారణలతో మురిపించారు. ఏకపాత్రాభినయాలతో ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకునే అవకాశం కల్గిందని చెబుతున్నారు.

పోటీతత్వం పెంచేలా

వేలాదిమంది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ పోటీలకు విచ్చేశారు. ఇలాంటి పోటీల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, కలివిడితనం మెరుగవుతుందని చెబుతున్నారు. ఇలాంటి బాలోత్సవాలు మరిన్ని జరగాలని ఉపాధ్యాయులు కోరుకున్నారు. ఈ నెల 30 వరకు మూడు రోజులపాటు ఈ పోటీలు జరగనుండగా.. భోజన, రవాణా, వసతిపరంగా నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి :

గుంటూరులో నవంబర్ 28 నుంచి బాలోత్సవ్-2019

AP_GNT_04_28_BALOTSAV_START_AVB_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: KESAVA RAO Anchor: గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బాలోత్సవ్- 2019 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బాలోత్సవ్ కార్యక్రమాన్ని ఏపీఎన్నార్టీ ఛైర్మన్ వెంకట్, వీవీఐటీ ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, బాలోత్సవ్ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి రమేశ్ గంట మోగించి ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాలోత్సవానికి హాజరయ్యారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో... 20 అంశాల్లో 59 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. చిత్రలేఖనం, సినీ, లలిత జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, ఏక పాత్రాభినయం, సంప్రదాయ వేషధారణ, విచిత్ర వేషధారణ వంటి అంశాల్లో తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. చిన్నారుల ఆటపాటలతో వీవీఐటీ ప్రాంగణంలో సందడి నెలకొంది. బాలల్లో వినోదం, అంతర్గత నైపుణ్యం వెలికితీయడానికి బాలోత్సవ్ కార్యక్రమాన్ని వ్యయప్రయాసల కోర్చి నిర్వహిస్తున్నామని....చిన్నారుల సంతోషం తమకు ఆత్మసంతృప్తిని అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు....BYTE.... BYTE: వాసిరెడ్డి విద్యాసాగర్, వీవీఐటీ ఛైర్మన్, గుంటూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.