ETV Bharat / state

ఎస్టీ బాలిక అపహరణకు యత్నం...దిశ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు - గుంటూరు వార్తలు

ఎస్టీ బాలికను అపహరించేందుకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మాగం పుల్లారావు ఎస్టీకాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు అడ్డుకుని బాలికను కాపాడారు.

Attempted abduction of a girl in Narasaraopet, Guntur district
నరసరావుపేటలో ఎస్టీ బాలిక అపహరణకు యత్నం
author img

By

Published : Aug 31, 2020, 10:31 AM IST

ఓ బాలికను అపహరించేందుకు కొందరు యువకులు చేసిన ప్రయత్నం గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. కొందరు అల్లరి మూకలు దాడి చేసి ఓ బాలికను అపహరించేందుకు యత్నించారని స్థానికులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపైనా దాడికి దిగారని... తిరగబడటంతో పరారయ్యారని చెప్పారు. నరసరావుపేట తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌ అరవింద్‌బాబును కలిసి విషయం చెప్పగా... దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివసంజీవయ్య కాలనీకి చెందిన మహేంద్ర, అతని సహచరులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారని బాధితులు ఆరోపించారు. కొన్ని రోజులుగా బాలికను వేధిస్తుండటంతో.. బంధువుల వద్ద ఉంచారని... ఇక్కడికి కూడా వచ్చి అపహరించేందుకు యత్నించారని వాపోయారు.

ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల బాలికపై వీఆర్‌ఏ అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.