ETV Bharat / state

దేశవాళీ వ్యవసాయం.. సాగులో సంప్రదాయం - అత్తోట బాపారావుపై వార్తలు

నిత్యం చెమటోడ్చి కష్టపడే రైతులు... రోగాల బారిన పడటం.. ఓ యువకుడిని ఆలోచనల్లో పడేసింది. మనం తీసుకునే అహారం విషతుల్యమై వివిధ రోగాలకు కారణమవుతున్న వేళ.. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార ధాన్యాల వైపునకు మళ్లీంచింది. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మట్టి ఒడిలోకి అడుగు పెట్టేలా చేసింది. దేశవాళీ విత్తనం, ప్రకృతి సేద్యం అనే జోడెడ్లతో సంప్రదాయ వ్యవసాయానికి సరికొత్త నిర్వచనం ఇచ్చేలా చేసింది. మనఊరు - మన విత్తనం పేరిట ఉద్యమబాట పట్టి.... రైతు లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ యువకుడే.. బాపారావు.

athota local seed protector
దేశవాళీ వ్యవసాయం
author img

By

Published : Oct 16, 2020, 7:44 PM IST

గుంటూరు జిల్లాకు చెందిన బాపారావుది.. అత్తోట గ్రామం. చదువు పూర్తయిన తరవాత.. గ్రాఫిక్‌ డిజైనర్‌గా ఉద్యోగం చేసేవాడు. అతడి కుటుంబంలో కొందరు కేన్సర్‌ బారిన పడి మృతి చెందారు. నిత్యం కష్టపడే రైతు కుటుంబాలు... రోగాల బారిన పడటం ఏంటనే ప్రశ్నలు అతడిని ఆలోచనల్లో పడేసింది. దీనికి ప్రధాన కారణం రసాయనాలతో కూడిన వ్యవసాయ విధానమని గ్రహించాడు.

అందులో భాగంగా.. ప్రకృతి సేద్యం గురించి అధ్యయనం చేసే సమయంలో దేశవాళీ విత్తనం గురించి తెలుసుకున్నాడు. విత్తన బ్యాంకులు, విత్తన పరిరక్షణ సంస్థలతో పాటు మరికొన్ని గ్రామాల నుంచి నాటురకం విత్తనాలు సమీకరించాడు. తనకున్న 25 సెంట్ల భూమినే ప్రయోగశాలగా మార్చుకున్నాడు.

ప్రకృతి సేద్యం చేయడం వల్ల గతంలో కంటే దిగుబడి తగ్గింది. అయినప్పటికీ... ఆ బియ్యం వండుకుని తినేటప్పుడు రుచిలో తేడా కనిపించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికీ మంచిగా ఉపయోగపడుతుందని గమనించాడు. ఇదే స్ఫూర్తితో ఈ విధానాన్ని మరికొంత మంది రైతులకు పరిచయం చేశాడు.

అలా బాపారావు కౌలుకు తీసుకున్న 5 ఎకరాల పొలంలో.. దేశవాళీ వరి విత్తనాలు అభివృద్ధి చేశాడు. ఆ విత్తనాలను రైతులకు అందజేశాడు. వారు తమ పొలంలో ఎంతో కొంత విస్తీర్ణంలో దేశవాళీ వరి రకాలు పండించాలి. పంట వచ్చాక మరికొందరు రైతులకు ఆ విత్తనాలు అందజేయాలి. ఇలా నాలుగైదు రకాలతో ప్రారంభమైన దేశవాళీ విత్తన ఉద్యమం.. నేడు రెండు వందల రకాలకు చేరింది.

ఏటా రైతులు తాము పండించిన వివిధ రకాల దేశవాళీ విత్తనాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. అక్కడకు ఇతర ప్రాంతాల రైతులు వస్తారు. వారు తమకు కావాల్సిన రకాలను కొనుక్కుని వెళ్తారు. ఇలా దేశవాళీ విత్తనాన్ని అత్తోట దాటించి ఇతర గ్రామాలకు విస్తరింపజేశాడు.. బాపారావు.

దేశవాళీ విత్తనాల్లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలుంటాయని బాపారావు చెప్తున్నారు. క్యాన్సర్, రక్తపోటు, చక్కరవ్యాధి, కొన్ని రకాల చర్మవ్యాధులతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని అంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు.. బాపారావు బాటలో మరో 80 మంది అత్తోట రైతులు పయనిస్తున్నారు.

పంట పండించడం అంటే.. పది మందిని బతికించడమే. ఈ గొప్ప పనికి.. మనదైన వ్యవసాయమే ఉత్తమమని తోటివారికి మళ్లీ గుర్తు చేస్తున్నాడు. దేశవాళీ విత్తనం అంటే మన వారసత్వమే కాదు.. మంచి ఆరోగ్యం కూడా అన్ననినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు.

దేశవాళీ వ్యవసాయం

ఇదీ చదవండి: డోర్ డెలివరీ వాహనాల్లో రూ. 63 కోట్లు ఆదా: పౌరసరఫరాల శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.