తమను తొలగించే జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా వేమూరు శాసనసభ్యులు మెరుగు నాగార్జున కార్యాలయం వద్ద వెలుగు యానిమేటర్లు నిరసన చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలకు భద్రత కలిగించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడానికి ఎదురుచూస్తుంటే ఉదయం నుంచి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వచ్చే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని ఖరాఖండిగా యానిమేటర్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట యానిమేటర్ల ఆందోళన