అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై నిన్నే వివరణ ఇచ్చానని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రత కోసమే ఫర్నీచర్‌ను తన క్యాంపు కార్యాలయంలో ఉంచామని చెప్పారు. వస్తువుల జాబితా రాసుకుని అధికారులతో మాట్లాడే తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఆ ఫర్నీచర్ తన క్యాంపు కార్యాలయంలోనే ఉందని, షోరూంలో కాదని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే తన పిల్లలపై కేసులు పెట్టారని, షోరూం మూసేయించారని ఆరోపించారు. ప్రభుత్వం మారిన వెంటనే అసెంబ్లీ అధికారులకు రెండుసార్లు లేఖ రాశానని, కానీ వారి నుంచి సమాధానం రాలేదన్నారు. ఫర్నీచర్ తీసుకెళ్లాలని, లేకుంటే డబ్బులైనా తీసుకోవాలని కోరానని వివరణ ఇచ్చారు. అధికారులు లేఖ అందలేదన్నారని, అందుకే మళ్లీ లేఖ రాశానని చెప్పారు. తెదేపాలో చేరిన వైకాపావారిని అనర్హులుగా ప్రకటించనందుకే తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సెల్‌ఫోన్లు, మందులు కూడా అమ్ముకున్నట్లు తనపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇది అత్యంత హేయమైన చర్య అని కోడెల అన్నారు. ఫర్నీచర్ వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందించకుండా... తెదేపా నేతలపై, తనపై వేధింపులు చేయడం సరికాదన్నారు.
"అసెంబ్లీ నాకు దేవాలయం.. ఐదేళ్లు పూజారిగానే ఉన్నా" - గుంటూరు
"పాత అసెంబ్లీలోని ఫర్నీచర్ భద్రత కోసమే నా క్యాంపు కార్యాలయంలో ఉంచాం. ప్రభుత్వం మారిన వెంటనే అసెంబ్లీ అధికారులకు జూన్ 7న లేఖ రాశా. కానీ వారు స్పందించలేదు. అసెంబ్లీ నాకు దేవాలయం.. ఐదేళ్లు పూజారిగానే ఉన్నా.." - కోడెల శివప్రసాదరావు, మాజీ సభాపతి