మొదటి ఆరు నెలల్లోనే రాష్ట్ర బడ్జెట్ అంచనాలు తారుమారు అయిపోతున్నాయి((ap budget news). ఆదాయం కంటే అప్పులు ఎక్కువై రాష్ట్రం ఇబ్బందుల్లో పడింది. గత ఏడాదితో పోలిస్తే.. గడిచిన ఐదు నెలల కాలంలో అదనపు ఆదాయం వచ్చినప్పటికీ.. చేస్తున్న వ్యయం ఎక్కువ కావడంతో అంచనాలు మారిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి(central grants to ap).
వేధిస్తున్న నిధుల సమస్య..
రాష్ట్ర పరిమితిలో 99 శాతం మేర అప్పులు కూడా తీసుకోవడంతో.. తదుపరి సంక్షేమ పథకాల అమలుకు నిధుల సమస్య వేధిస్తోంది(ap govt facing financial difficulties news). ఇందులో భాగంగానే నవరత్నాల్లో కీలకమైన.. అమ్మఒడి పథకం(amma vodi scheme news) అమలును 2022 జూన్ కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. గడిచిన ఐదు నెలల కాలంలో పన్నుల పెంపు కారణంగా 15,361 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చినా.. మొదటి ఐదు నెలల్లోనే 99 శాతం మేర రుణాలు తీసేసుకోవటంతో తదుపరి అర్ధ సంవత్సరం పరిస్థితి ఏమిటన్నది అయోమయంగా మారింది.
గడిచిన 5 నెలల కాలంలో ఏపీ ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర పన్నుల ద్వారా 53,159 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు మాత్రం 90,071 కోట్లుకు చేరుకుంది. ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం 36,912 కోట్లకు చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,77,106 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అయితే.. తొలి ఐదు నెలల్లో 53 వేల కోట్ల రూపాయలు మాత్రమే రావడంతో ప్రభుత్వ ఖజనా ఇబ్బందుల్లో పడింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 15,361 కోట్ల ఆదాయం రావటం ఆర్థిక శాఖ ఇబ్బందులను కాసింత తగ్గించాయి.
వచ్చింది కేవలం 14 వేల కోట్లే..
మరోవైపు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన గ్రాంట్లు 57,930 కోట్లు రుపాయిల మేర రావాల్సి ఉన్నా.. ఇప్పటికీ వచ్చిన నిధులు కేవలం 14వేల కోట్లు మాత్రమే విడుదల కావటం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా.. ఆర్థిక మంత్రి బుగ్గన దిల్లీలోనే మకాం వేస్తున్నారు(ap finance minister buggana rajendranath reddy news). బడ్జెట్లో 84 వేల కోట్ల వరకు రెవెన్యూ వ్యయం ప్రతిపాదిస్తే.. అందులో 5,723 కోట్లను మాత్రమే పెట్టుబడి వ్యయంగా ప్రభుత్వం చూపింది. ప్రస్తుతం ఆదాయం - వ్యయం మధ్య భారీగా అంతరం ఉండటంతో దీన్ని రుణ రూపంలోనే ప్రభుత్వం భర్తీ చేసింది.
ఆదాయం కంటే వ్యయం 36,912 కోట్లు అధికంగా ఉండటంతో దీన్ని రుణ సమీకరణ ద్వారా పూర్తి చేశారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికిగానూ రుణ సేకరణ మొత్తాన్ని 37,029 కోట్లుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే.. ఇందులో 99 శాతం మేర మొత్తాన్ని రుణంగా తీసేసుకోవటంతో మిగిలిన 6 నెలల కాలానికి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొవిడ్ కారణంగా ఎఫ్ఆర్బీఎం పరిమితిని (FRBM limits) కూడా కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచటంతో మరింతగా రుణాలను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కలిగింది.
ఇదీ చదవండి: