గుంటూరు లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం నాయకులు నిరసన చేపట్టారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అమరావతి ఐకాస, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఫోరం జాతీయ కార్యదర్శి హానుమత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ... రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి వారిని రోడ్డుపై పడవేశారని అన్నారు.
రైతు హక్కులను హరించే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని దిల్లీ వెళ్లిన రైతుల విషయంలో కేంద్రప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని అమరావతి ఐకాస నాయకుడు శ్రీనివాసరావు అన్నారు.
ఇదీ చదవండి: