ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండో రోజు అనిశా తనిఖీలు - తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అనిశా వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనిశా అధికారులు.. రెండో రోజు తనిఖీలు కొనసాగించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సోదాలు చేశారు. రాకపోకల ఖర్చు పేరుతో ఆస్పత్రి అధికారులు 4 లక్షల రూపాయలు మాయం చేసినట్లు గుర్తించారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన 3 వేల మందికి రెండేళ్లు చెల్లింపులు నిలిపివేశారని... నకిలి పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించారు.