లాక్డౌన్ ఓ సాధువుని సైకిల్ ఎక్కించింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన పశుపతి అనే సాధువు తీర్థయాత్రల్లో భాగంగా మార్చి 21న కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వెళ్లారు. అయితే లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. రెండు నెలల పాటు అక్కడే ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు... చివరకు ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలని అక్కడి వారి సాయంతో ఓ సైకిల్ సమకూర్చుకున్నాడు. సైకిల్ తొక్కుకుంటూ తునికి బయలుదేరారు. ఆరు రోజుల క్రితం బ్రహ్మం గారి మఠంలో ప్రయాణం ప్రారంభించి.. శనివారానికి గుంటూరు చేరుకున్నారు. మార్గమధ్యంలో దాతలు ఇచ్చే ఆహారంతో కడుపు నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో సొంతూరికి చేరుకుంటానని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి విజయనగర రాజుల కాలం నాటి కట్టడం కూల్చివేత