Bike Rally of Aqua Employees at Eluru: ప్రస్తుతం ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే దేశీయ మార్కెట్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆక్వా ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ 'రొయ్యలు, చేపలు తినండి-ఆరోగ్యంగా ఉండండి' అని నినాదిస్తూ.. ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ నుంచి సత్రంపాడు వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఆక్వా రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందాలంటే, ప్రభుత్వాలు కల్పించుకుని స్థానికంగా ఆక్వా స్టాళ్లను ఏర్పాటు చేసి ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని ఆకాంక్షించారు. లేనిపక్షంలో అటు రైతులతో పాటు ఇటు పరిశ్రమలు వాటిపై ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులు సైతం రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి