తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో కొవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా వ్యాపారులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ఆదేశించారు. అమలాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
విధిగా పాటించాలి..
లాక్‌డాన్ అమలు చేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయని ఈ కారణంగా ఆ చర్యకు వెళ్లకుండా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారులతో పాటు వారి వద్ద పనిచేసే సిబ్బంది వినియోగదారులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సబ్ కలెక్టర్ కౌశిక్ తెలిపారు. అమలాపురం డివిజన్ వ్యాప్తంగా రెవెన్యూ పోలీస్ అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
![వ్యాపారులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలి : హిమాన్షు కౌశిక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-rjy-26-10-subcollector-chamberofcommerce-meeting-ap10020_10102020213216_1010f_1602345736_659.jpg)
ఆకస్మిక తనిఖీలు..
ఈ కమిటీలు దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేస్తాయని ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు పాటించని దుకాణాలను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ హెచ్చరించారు. దసరా ఉత్సవాల్లోనూ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ, షేక్ మాసుమ్ బాషా పాల్గొన్నారు.