ETV Bharat / state

ఉపాధి కరవైందని ట్రాక్టర్ యజమానుల నిరసన

అధికారుల వల్ల ఉపాధి కరవైందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ట్రాక్టర్ల యజమానులు నిరసనకు దిగారు. చిన్నపాటి మట్టి తవ్వకాల పనులు చేసినా.. మట్టి వ్యర్థాలను తరలించినా మైనింగ్ అనుమతులు కావాలంటూ అధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు, స్థానిక పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలోనూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

Tractor owners protest
ట్రాక్టర్ యజమానుల నిరసన
author img

By

Published : Jan 11, 2021, 5:56 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులు నిరసన చేపట్టారు. పొలాల్లో చిన్నపాటి మట్టి తవ్వకాల పనులు చేస్తున్నా మైనింగ్ అనుమతులు కావాలంటూ పోలీసులు, ఇతర సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలమైన ఇళ్లను, కట్టడాలను తొలగించినప్పుడు ఆ వ్యర్థాలను తీసుకువెళుతున్న ట్రాక్టర్​లను అనుమతుల పేరుతో అడ్డుకుంటున్నారని తెలిపారు. అధికారుల ప్రవర్తన కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు, స్థానిక పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలోనూ అందజేశారు.

ఇదీ చదవండి: సంక్రాంతి పిడకలంట.. 280 అడుగులంట.!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.