విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెదేపా నాయకులతో కలిసి నల్లరంగు రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని నినాదాలు చేస్తూ ర్యాలీగా గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని... విగ్రహం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.
ఇదీ చూడండి రాష్ట్రాలకు ఊరట- రుణ పరిమితి పెంపు