తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెం వద్ద కాజ్ వే వంతెన ఏలేరు వరద నీటి ఉద్ధృతికి కుంగిపోయింది. బ్రిడ్జ్ కుంగిపోవటంతో ఏలేశ్వరం నుంచి జగ్గంపేట మండలంలోని మామిడాడ, ఇర్రిపాక, మర్రిపాక, నరేంద్రపట్నం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంగిన వంతెనను ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. నీటి ఉద్ధృతి తగ్గాక....చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!