తూర్పుగోదావరిజిల్లా ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సుకుమా మామిడి వంతెన వద్ద గురువారం సాయంత్రం పోలీసులు 44కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాలోని పప్పులూరు నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ కు కారులో అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.
కారును సీజ్ చేశారు. కారు డ్రైవర్, గంజాయి కూలిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతుగూడెం ఎస్ఐ టీవీ సుబ్బారావు తెలిపారు.
ఇవీ చదవండి: జనావాస ప్రాంతాల్లో ఆక్వా సాగును అడ్డుకున్న గ్రామస్థులు.