ETV Bharat / state

రైతు భరోసా ఫిర్యాదులు.. క్యూకట్టిన అన్నదాతలు - Rythu bharosa latest news

రైతు భరోసా పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం... రాష్ట్రవ్యాప్తంగా వినతుల స్వీకరణకు స్పందన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. రైతులు తమ మొర వినిపించేందుకు మండల తహసీల్దార్‌ కార్యాలయాలకు పోటెత్తారు.

రైతు భరోసా ఫిర్యాదులు.. క్యూకట్టిన అన్నదాతలు
author img

By

Published : Nov 9, 2019, 8:25 PM IST

రైతు భరోసా ఫిర్యాదులు.. క్యూకట్టిన అన్నదాతలు

రైతు భరోసా పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలపై వినతులు స్వీకరించింది. ఇందుకోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. రైతులు తమ మొర వినిపించేందుకు తహసీల్దార్‌ కార్యాలయాలకు బారులు తీరారు.

శ్రీకాకుళం జిల్లాలో..
రైతు భరోసా అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా కలెక్టర్‌ నివాస్ స్పష్టం చేశారు. ఈ నెల 15లోగా లబ్ధిదారులందరూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

విజయనగరం జిల్లాలో
సాలూరు నియోజకవర్గం పరిధిలో పాచిపెంట, మక్కువ, సాలూరు మెంటాడ మండలాల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అగ్రికల్చర్ శాఖ కలిపి రైతు భరోసా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిశిఖర గ్రామాల నుంచి కూడా గిరిజనులు తరలివచ్చి తమ ఫిర్యాదులు అధికారులకు అందజేశారు.

విశాఖ జిల్లాలో
రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కట్టారు. రైతు భరోసా అందని రైతులు తమ ధ్రువపత్రాలతో అధికారులకు ఫిర్యాదులు చేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో
రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం, కోరుకొండ మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు భరోసాపై స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన రైతులు తమ ఫిర్యాదులను అధికారులకు అందించారు. ఆధార్​లో తప్పులు, పట్టా ఆన్​లైన్​లో కాకపోయినా, చనిపోయిన వారి పేరున డబ్బులు పడినా, ఒకరికి బదులు వేరొకరికి నగదు జమ అయినా.. ఇలాంటి ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో స్పందన కార్యక్రమాలు నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో
ఆచంట తహశీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసాపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌.... ప్రతి దరఖాస్తునూ పరిశీలించి అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. మోపిదేవి మండల తహశీల్దార్‌ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన రైతులు... తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు పెట్టుకున్నారు.

గుంటూరు జిల్లాలో
జిల్లాలో చాలామందికి రైతు భరోసా డబ్బులు జమ కాలేదని... ఎన్నిసార్లు ఈ అంశం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన రైతు భరోసా స్పందన కార్యక్రమంలో తమ ఫిర్యాదులు అధికారులకు అందించారు.

నెల్లూరు జిల్లాలో
వాకాడుతో సహా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో రైతు భరోసాపై స్పందన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో రైతులు పాల్గొని వారి సమస్యలను అధికారులకు తెలిపారు. రైతు భరోసా డబ్బులు పడని రైతులు ఎందుకు పడలేదో తెలుసుకునేందుకు కార్యాలయాలకు వచ్చారు. తమ దగ్గరున్న భూపత్రాలు చూపి ఫిర్యాదులు చేశారు.

అనంతపురం జిల్లాలో
జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో రైతు భరోసా అందని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతులు అధికారులకు అర్జీలు సమర్పించి, తమకు ఎందుకు రైతు భరోసా జమ కాలేదో తెలిపాలని కోరారు. 72 గంటల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల మండల స్థాయిల్లో రైతుల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించిన అధికారులు... వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :

సమస్య పరిష్కారం కోసం ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..?

Intro:ap_tpg_82_9_pratyekaspandana_ab_ap10162

Body:దెందులూరు లో రైతు భరోసా కు సంబంధించి ప్రత్యేక స్పందన కార్యక్రమం శనివారం నిర్వహించారు . వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతు భరోసా పథకం లో అర్హత ఉండి నగదు అందని రైతుల నుంచి వివరాలను తీసుకొన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుబ్బారావు, తాసిల్దార్ శేషగిరి, ఎంపీడీవో లక్ష్మి , వ్యవసాయ శాఖ అధికారి రమేష్, విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు ర

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.