తూర్పు గోదావరి జిల్లా గోపాలపట్నం చెక్ పోస్ట్ వద్ద లారీ.. కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి వస్తున్న కారు చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి.. రాంగ్ రూట్లో ఎదురుగా బొండు మట్టితో వస్తున్న లారీ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు గోపాలపురం సమీపంలోని ఉన్న బొండు మట్టిని లారీలో తరలిస్తున్నారు. లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఢీ కొట్టడమే ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విషాద చిత్రం.. అస్తమించిన 'ఉదయ కిరణం'