తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొగ్గులదిబ్బ రైతుబజార్ ఎస్టేట్ అధికారి వెంకటేశ్వరరావు.. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి నిత్యం రైతుబజార్‌కు వచ్చేవాళ్లకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూనే ఉన్నారు.
కరోనా బారినపడి అమెరికా, ఐరోపా దేశాల్లో ఎలా మరణాలు సంభవిస్తున్నాయి అనే అంశాలను వివరిస్తున్నారు. అలాగే రైతు బజార్లో అమ్మే కూరగాయలు, పళ్లు వాటి పోషక విలువల గురించి వివరిస్తున్నారు. తన రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే.. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ఆయన చెప్తున్న విధానాన్ని ప్రశంసిస్తున్నారు. సూచనలు పాటిస్తున్నారు.
ఇదీ చదవండి: