చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు దొంగను పట్టుకున్నారు. సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేటకు చెందిన దాసరి సుజాత ఇంటికి మధ్యాహ్నం ఒక వ్యక్తి వచ్చి అరుగుపై పడుకున్నాడు. కాసేపటికి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించిన అతను... ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పాడు.
ఆ తర్వాత బీరువా తాళం తీసుకుని... 2 కాసుల బంగారు, 20 తులాల 5 గ్రాముల వెండి వస్తువులు, నగదు చోరీ చేసి పరారయ్యాడు. బాధితురాలు వెంటనే కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై శ్రీనివాస్ నాయక్ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చోరీ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అతను కొత్తపేట పాత రామాలయం ప్రాంతానికి చెందిన ముద్రగడ నాగభూషణంగా గుర్తించి.. కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: