తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. జగనన్న పచ్చతోరణం పోస్టర్ ను విడుదల చేశారు. లాక్ డౌన్ వల్ల హడావుడి లేకుండా పచ్చతోరణం ప్రారంభించామని ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అన్నారు. ప్రతిష్ఠాత్మకంగా ఇవ్వబోతున్న స్థలాలు 72ఎకరాల్లో పర్యావరణ పరిరక్షణగా జగనన్న పచ్చతోరణం తీసుకువచ్చామని అన్నారు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద వెయ్యి మొక్కలను పెంచి అందిస్తామని ఎంపీడీఓ వెంకట లక్ష్మి అన్నారు. సీఎం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువగా మొక్కలు నాటి అటవీశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని పచ్చతోరణం చేస్తామన్నారు.
ఇదీ చదవండి 'మంత్రి వనితను అడ్డుకున్న ప్రజాసంఘాలు'