ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

author img

By

Published : Mar 4, 2021, 1:58 PM IST

సైకిల్​పై వెళుతున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదానికి కారణమైన కారును ఆపకుండానే వెళ్లి పోవడంతో మృతి చెందిన వ్యక్తి బంధువులు , స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

road accident
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఆగకుండానే వెళ్లిన కారు

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన కుసుమే సత్యనారాయణ(56) అనే వ్యక్తి సైకిల్ పై పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వెళ్లి వస్తుండగా గోపాలపురం చెక్​పోస్ట్ సమీపంలో కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోవడంతో బంధువులు. గ్రామస్థులు ఘటనా జరిగిన చోటుకు చేరుకుని నిరసన తెలిపారు. కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని బంధువులకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ప్రత్యర్థికి ఓటేశారనే కక్షతో కొన్ని కుటుంబాల వెలి...కలెక్టర్ పర్యటనతో ఘటన వెలుగులోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.