తెలుగు దేశం నేత అయ్యన్నపాత్రుడిపై 5 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేసినట్లు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ తెలిపారు. భూదందాలకు పాల్పడినట్లు అయ్యన్నపాత్రుడు ఆరోపించటమే కాకుండా, వ్యక్తిగత దూషణలకు పాల్పడినందుకు పరువునష్టం దావా వేసినట్లు స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పే సమయం వస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న వారిని ఉక్కుపాదంతో వైకాపా ప్రభుత్వం అణచి వేస్తుందన్నారు. ప్రశాంతమైన రాజమహేంద్రవరంలో భూదందాలకు పాల్పడుతున్న వారిని వదిలేది లేదనీ... రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితిల్లో సహించేది లేదన్నారు.
ఇదీ చదవండి: అన్నార్తులకు అండగా... శశి ఫౌండేషన్