ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి.. స్వస్థలానికి వస్తున్న తోట త్రిమూర్తలుకు స్వాగతం పలికే క్రమంలో ఆయన అభిమానులు, పోలీసులకు మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో త్రిమూర్తులుకు భారీ గజమాల వేసేందుకు అభిమానులు.. రోడ్డుపైకి క్రేన్ తీసుకువచ్చారు. కొవిడ్ నిబంధనలకు తోడు.. క్రేన్ వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని పోలీసులు అడ్డుకున్నారు. క్రేన్ డ్రైవర్ను పోలీసులు కిందకు దింపటంతో.. సర్పంచ్ వెంకట్రెడ్డి డ్రైవర్ స్థానంలోకి వెళ్లి కూర్చున్నారు. ఈ క్రమంలో స్వల్వ వాగ్వాదం జరిగింది. విషయం తెలుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు ఘనస్వాగతం
అనంతరం.. గోపాలపురం వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును అభిమానులు ర్యాలీగా తీసుకొని వచ్చారు. రావులపాలెం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానులు పూల కిరీటం అలంకరించి గజమాలతో సత్కరించారు. అనంతరం గౌతమీ వంతెన మీదుగా ఆలమూరు మండలం చేరుకొని అక్కడ అభిమానులతో కలిసి మండపేట చేరుకున్నారు.
ఇదీ చదవండి: YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్ చేయూత: సీఎం జగన్