తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం నుంచి రమణయ్యపేట వరకు రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ. 6.6 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో 70 శాతం రోడ్లు గత ప్రభుత్వ హయాంలో పూర్తి కాగా.. 30 శాతం రోడ్లు వరకు పూర్తి కాలేదన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో మిగతా రోడ్లు కూడా నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చూడండి