తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత లోకేశ్ పై మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆరోపించారు. అమరావతి రైతుల తరఫున తప్ప... ఏనాడైనా పేద, సన్నకారు రైతుల సమస్యలపై మాట్లాడారా..? అని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మీడియా అటెన్షన్ కోసమే సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతేడాది పంట నష్టం కింద రూ.125 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో చెరకు రైతులకు బకాయిలు ఉన్న రూ. 55 కోట్లను సీఎం జగన్ చెల్లించారని చెప్పారు. వర్షాలకు, వరదలకు తేడా తెలియకుండా లోకేశ్ మాట్లాడుతున్నారని... ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: