తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత యానాంలో పెరుగుతున్న రోగుల సంఖ్యతోపాటు కోలుకుని ఇంటికి వెళ్తోన్న వారి సంఖ్య సైతం ఎక్కువగానే ఉంది. కానీ వీరంతా మరో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండటం ఇబ్బందికరంగా మారింది. ఒకటి లేదా రెండు గదులు మాత్రమే ఉండే ఇంటిలో ఇది సాధ్యపడడం లేదు. కరోనా బాధితులు పడే కష్టాలను గమనించిన అగ్నికుల క్షత్రియ సేవా సంఘం తమ కళ్యాణ మండపాన్ని కోవిడ్ బాధితులకు పునరావాస కేంద్రంగా తీర్చిదిద్దింది.
సుమారు 40పడకలు పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా మంచాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడుండే 14 రోజులు ఉచితంగా పౌష్టికాహారం అందించనున్నారు.. అందుకయ్యే పూర్తిగా ఖర్చులన్నీ సంఘమే భరించనుంది. వేలకు వేలు అద్దెలు తీసుకునే ఇంటి యజమానులు కనీసం మానవత్వం చూపకుండా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం చూపుతున్న సేవాభావాన్ని స్థానిక నాయకులు, కరోనా బాధితుల కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారు.