తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లోని గ్రామ పంచాయతీలో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. అమలాపురం డివిజన్ మొత్తంలో 259 గ్రామ పంచాయతీ సర్పంచులు 2065 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
రాజోలు నియోజకవర్గంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రానికి బారులు తీరారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముమ్మిడివరం సెంటర్ సమస్యాత్మక ప్రాంతాల్లో చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని సీఐ జానకిరామ్ తెలిపారు. ఐపోలవరం మండలం పల్లంవారి పాలెం, కాట్రేనికోన మండలంలోని పల్లం, ముమ్మిడివరం మండలం అయినాపురం అత్యంత సమస్యాత్మకమైన పంచాయతీలను గుర్తించి.. అదనపు బలగాలను నియమించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
అమలాపురం డివిజన్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటర్లు చైతన్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం మొగలమూరు గ్రామంలో ఓటు హక్కును ఎంపీ చింత అనురాధ వినియోగించుకున్నారు.
కొత్తపేటలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, గోపాలపురంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వాడపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి: