తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలాల్లో భారీ వర్షాల కారణంగా రైతులు కుదేలయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల వరి పంట నేలకొరిగింది.
- పెట్టుబడి నష్టం..
ఎకరాకు సుమారు 30 వేల రూపాయలతో పెట్టుబడులు పెట్టామని.. ప్రస్తుత పరిస్థితితో పంటలు నేలరాలిపోయాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాల కష్టంతో పంట చేతికి అందే సమయానికి అకాల వర్షంతో పంటలు తీవ్రంగా పాడయ్యాయని వాపోయారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.