స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించే దిశగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. డివిజన్ల మద్య పోటీ పెట్టడంతోపాటు.. ప్రజల్లో చైతన్యం నింపే దిశగా చర్యలు చేపడుతోంది. కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నగరంలో ముమ్మరంగా పర్యటించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పదేపదే చెబుతున్నా తడి - పొడి చెత్త వేరుచేయకుండా, వీధుల్లోకి వస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను అందజేయకుండా రోడ్లపైనే పారబోస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి వారికి కమిషనర్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంట్లోని చెత్త రోడ్డుపై పారబోయడం చూసి అదే చెత్తను రిటర్న్ గిప్ట్ కింద.. తిరిగి వారి ఇంటి దగ్గరే వేయించడం చర్చనీయాంశం అయ్యింది. ప్రజల్ని చైతన్య పరిచే క్రమంలో.. బాగా పనిచేస్తున్న వారికి బహుమతులు, ధ్రువపత్రాలు ఇస్తున్నట్లే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి జరిమానాలతోపాటు ఇలా రిటర్న్ గిఫ్టులు ఇస్తున్నామని కమిషనర్ తెలిపారు. అయితే ఈ చర్యలన్నీ ప్రజల్లోచైతన్యం నింపడానికేనని అంటున్నారు. కాకినాడ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రస్తుతం 57వ ర్యాంకులో ఉండగా.. పది లోపు ర్యాంకు కోసం పోటీ పడుతోంది.
ఇవీ చూడండి...