తూర్పుగోదావరి జిల్లాలో హోంగార్డు దినోత్సవాన్ని కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఐజీ మోహన్రావు, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నాయిం అస్మీ హాజరై హోం గార్డ్ల గౌరవ వందనం స్వీకరించి హోమ్ గార్డ్ యూనిట్ పతాకాన్ని ఎగరవేశారు. 1963 వ సంవత్సరం డిసెంబరు 6వ తేదీన రాష్ట్రంలో హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించబడిందని..డీఐజీ తెలిపారు. అందువల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 6 న దేశ వ్యాప్తంగా సంస్థ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకొంటారని అన్నారు. నేర నియంత్రణలో లా, ఆర్డర్ , ట్రాఫిక్ నియంత్రణ, బ్లూ కోర్టు, పెట్రోల్ కార్, డ్రైవర్లు, కార్యాలయాల భద్రత , రాత్రి గస్తీ , బందోబస్త్ లలో హోంగార్డ్స్ పాత్ర ఎంతో కీలక మైందని కొనియాడారు. జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని కొనియాడారు.
ఇదీ చదవండి: