ETV Bharat / state

వాలంటీరు పోస్టులిచ్చింది.. మన పార్టీ వారికే కదా..! : హోం మంత్రి - హోంమంత్రి తానేటి వనిత తాజా వార్తలు

Minister Teneti Vanitha on Volunteer Jobs: పార్టీ అంటేనే కార్యకర్తలని.. అటువంటి వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుందని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. వైకాపాలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కొంతమంది విషప్రచారం చేస్తున్నారని చెప్పారు.

TANETI VANITHA
TANETI VANITHA
author img

By

Published : Jun 28, 2022, 7:53 AM IST

TANETI VANITHA: పార్టీ అంటేనే కార్యకర్తలని.. అటువంటి వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుందని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆ నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌నాయుడు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి పాల్గొని మాట్లాడుతూ.. వైకాపాలో కార్యకర్తలకు గుర్తింపు లేదని కొంతమంది విషప్రచారం చేస్తున్నారని చెప్పారు.

‘నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చింది పార్టీ వారికి కాదా? వాలంటీరు పోస్టులు ఇచ్చింది.. వైకాపా కుటుంబాలకు చెందిన వారికి కాదా’ అంటూ ఆమె ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో పలువురు కార్యకర్తలు వెళ్లిపోయారు. ఒక సమయంలో బయటకు వెళ్లే ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో తెరవాలంటూ కార్యకర్తలు కేకలు వేయగా, తలుపు తీయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు మైక్‌లో చెప్పారు. సమావేశంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.