వారం రోజులుగా ఉగ్రరూపంతో ప్రవహించిన గోదావరి.. కాస్త శాంతించింది అనుకునేలోపే మరోసారి ఉధృరూపం దాల్చింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 12.2 అడుగుల నీటిమట్టం నమోదైంది. కాటన్ బ్యారెజ్ వద్ద ఇప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. ఆనకట్ట నుంచి డెల్టా కాల్వలకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ సముద్రంలోకి సుమారు 10 లక్షల 45 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 42 అడుగులకు చేరింది.
ఇది కూడా చదవండి.