కరోనాపై పోరుకు తాను సిద్ధం అంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మి భార్య హీనా టక్ సిద్ధమయ్యారు. మైక్రో బయాలజీలో ఎండీ చేసిన ఆమె.. కాకినాడ జీజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో పరీక్షలు చేసేందుకు ముఖాముఖికి హాజరయ్యి, అర్హత సాధించారు. ఈ మేరకు రంగారయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కే.బాబ్జీ ఆమెకునియామక పత్రం అందజేశారు. దీంతో కాకినాడ జీజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో కరోనాపై పరీక్షలు చేసేందుకు, బుధవారం విధుల్లో చేరారు.
ఇదీ చదవండి: కొత్తపేట నియోజకవర్గంలో విజృంభిస్తున్న కరోనా