కొవిడ్ ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో అటు ప్రజలతో పాటు.. ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద.. ప్రజలు నేరుగా అధికారులను సిబ్బందిని కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా కారణంగా లోపలికి ఇతరులు రాకూడదని బోర్డులు ఏర్పాటు చేసి.. ప్రవేశ ద్వారం వద్ద పెట్టారు. ప్రజల నుంచి అర్జీలను ఫోన్ల ద్వారా విజ్ఞప్తి చేయవచ్చునని తెలిపారు.. ఈ విధంగా సాధ్యం కానివారు దరఖాస్తు రూపంలో బయట ఏర్పాటు చేసిన తొట్టిలో వేయాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: సాధారణ రోగులకు లేని పడకలు.. రిక్షాలోనే చికిత్స