తూర్పు గోదావరి జిల్లా.. ఆలమూరు మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెనికేరులోని ఇద్దరు, మడికిలో ఒకరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. మండలంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 29కి చేరింది. మడికిలో కరోనా వచ్చిన వ్యక్తి ఆ ప్రాంతంలో జాతీయ రహదారిలో ఓ హోటల్ లో పని చేస్తున్నారు. ఆ హోటల్లో భోజనాలు చేసిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి