ఫోనులో మాయమాటలు చెప్పి ఆన్‌లైనులో నగదు చోరీ చేసిన ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక విద్యానగర్ ప్రాంతానికి చెందిన వీవీఎన్ ప్రవీణ్ ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అతడికి గురువారం సాయంత్రం ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా కేవైసీ అప్‌డేట్ చేయాలన్నాడు. మాటల్లో పెట్టి ఫోన్‌కు ఓ యాప్ లింక్ పంపాడు. దానిని క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించాడు. ప్రవీణ్ ఆ యాప్‌ను తన ఫోన్లో ఇన్‌స్టాల్ చేసిన అరగంట వ్యవధిలో అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.52 వేలు డ్రా అయ్యాయి. ఆ మొత్తం మూడు దఫాలుగా డ్రా అయినట్లు ఫోన్‌కు సంక్షిప్త సందేశాలు రావడంతో బాధితుడు బ్యాంకు వారిని సంప్రదించాడు. తాము ఎటువంటి సందేశాలు పంపలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. మోసపోయానని తెలుసుకున్న ప్రవీణ్ మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: యూపీలో మైనర్ అపహరణ, సామూహిక అత్యాచారం