ETV Bharat / state

ఏడడుగుల బంధం..7 రోజులకే అంతం

కాళ్ల పారాణి ఆరలేదు.. తోరణాలు వాడలేదు.. సందళ్లు ఆగలేదు.. సంబరాలు ఆపలేదు.. మనసే విరిగిందో.. మరేం జరిగిందో.. నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఏడడుగులు వేసిన ఏడు రోజులకే జీవితానికి ముగింపు పలికింది. పచ్చని పందిళ్లు, మామిడాకుల మధ్య గుండెలు పగిలేలా బంధువులు చేసిన రోదన అందరినీ కలచివేసింది.

crime
crime
author img

By

Published : Jul 6, 2021, 11:35 AM IST

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి(19)కి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్‌తో గత నెల 29న వివాహం చేశారు. రెండు రోజుల కిందట వధూవరులు గాదరాడ వచ్చారు. ఆషాఢమాసం వస్తుండటం, సోమవారం మంచిరోజు కావడంతో.. సాయంత్రం తిరిగి వధువును పుట్టింటికి పంపడానికిసిద్ధం చేశారు.

అంతలోనే స్వాతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అందరూ ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమెకు అశోక్‌ మేనమామ వరస అవుతాడు. అశోక్‌ తాపీ పని చేస్తుంటాడు. ఈ మధ్యనే కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాక.. వివాహం చేసుకున్నాడు. అశ్విని మృతితో అతడు కుప్పకూలాడు. అయితే.. ఆమె మృతి విషయం బయటకు రాకుండా ఇరు కుటుంబాల వారు రాజీ అయ్యారు. దగ్గర బంధువులే కావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. బంధువుల్లో ఓ వ్యక్తి 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహానికి తహసీల్దారు సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: Theatre re open: తెరపై 'బొమ్మ' పడేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.