కరోనా నివారణకు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆరోగ్య భారత యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని దర్భారు మండపంలో అర్చకులు, పండితులు, పురోహితుల బృందం ఆధ్వర్యంలో త్రిపాద్విభూతి మహా నారాయణ ఉపనిషద్ హోమం జరిగింది. సత్యదేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో హామాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇదీ చూడండి. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి