తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో వచ్చే నెల జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాల ఏర్పాట్లను అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ పరిశీలించారు. ఫిబ్రవరి 19న రథసప్తమి రోజున ఈ ఉత్సవాలు మొదలై 28 వరకు జరగనున్నయి. 22 రాత్రి స్వామివారి కల్యాణోత్సవం, 23న రథోత్సవం, 27న చక్రస్నానం , 28న తెప్పోత్సవం నిర్వహిస్తారు.
19 నుంచి 28 వరకు స్వామి వారు వివిధ వాహనాలపై విహరిస్తారు. కళ్యాణోత్సవం నిర్వహించే ప్రదేశంతో పాటు రథోత్సవం, చక్రవర్తి స్నానం, తెప్పోత్సవం.. ముఖ్యమైన ఘట్టాలు జరిపే ప్రదేశాలను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆలయ అధికారి వై భద్రాజి, అర్చక స్వాములకు పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: