తూర్పు గోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సత్యసుశీల జిల్లాలో కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 3,442 మందితో పాటు దిల్లీ నుంచి వచ్చిన వారు స్వీయ గృహ నిర్భంధంలో ఉన్నారని చెప్పారు. తాజాగా కత్తిపూడిలో వెలుగు చూసిన కేసులతో పాటు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 17కు చేరినట్లు చెప్పారు. కత్తిపూడిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని పంపి ర్యాండమ్‌గా నమూనాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: