CBSE SYLLABUS: రాష్ట్రంలో 6,500కు పైగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. వీటిలో వెయ్యి బడులకు మాత్రమే సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు లభించింది. ప్రైవేటు, ఎయిడెడ్‌లో కలిపి 6 వేల వరకు ఉండగా.. వీటిల్లో ఒక్కదానికీ సీబీఎస్ఈ గుర్తింపు లేదు. భవిష్యత్తులోనూ ఆ స్కూళ్లు సీబీఎస్ఈ అనుమతికి వెళ్లే పరిస్థితి లేదు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, సబ్జెక్టుల ఐచ్ఛికాలు భిన్నంగా ఉన్నాయి.
ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు సరఫరా: ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సరఫరా చేశారు. వారికి 9, 10 తరగతుల్లోనూ ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలనే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఒకటి నుంచి ఏడో తరగతి వరకు గణితం, ఆంగ్లం, ఆరేడు తరగతులకు సామాన్యశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలనే అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకటి నుంచి ఏడులో సాంఘిక శాస్త్రం మినహా.. పదో తరగతి వరకు అందరికీ ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలనే ఇవ్వనున్నారు.
ప్రస్తుత స్టేట్ సిలబస్: ప్రస్తుతం రాష్ట్ర బోర్డులో ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్ సిలబస్ చదువుతున్నందున.. వీటిని 5 సబ్జెక్టులకు కుదిస్తారా, లేదా అనే దానిపై స్పష్టత లేదు. హిందీని తొలగిస్తే దాన్ని బోధించే ఉపాధ్యాయులను ఏం చేస్తారన్నదీ తెలియదు.
సీబీఎస్ఈ సిలబస్లో లాంగ్వేజ్ పేపర్స్: సీబీఎస్ఈ ఎలెక్టివ్ విభాగంలో లాంగ్వేజీలున్నా.. తెలుగు, హిందీ, ఇతర భాషల పేపర్లలో ఉత్తీర్ణులు కాకుంటే ఈ సబ్జెక్టు మార్కులను పరిగణనలోకి తీసుకునేలా ఉంది. కానీ ఆప్షనల్స్‌కు అనుబంధంగా నైపుణ్య సబ్జెక్టులు ఉన్నాయి. పదో తరగతిలో ప్రస్తుతం అంతర్గత మార్కులు లేవు. వంద శాతం రాత పరీక్షే నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న అంతర్గత మార్కుల విధానాన్ని రద్దు చేశారు. ఇప్పుడు దీన్ని పునరుద్ధరిస్తారా, లేదా అనే దానిపైనా నిర్ణయం రాలేదు. ప్రస్తుతం 8వ తరగతి ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు చదువుతున్నవారు.. రెండేళ్లలో పదో తరగతి పరీక్షలు రాస్తారు. ఇప్పటి నుంచే వారిని అందుకు అనుగుణంగా సన్నద్ధం చేయాల్సి ఉన్నా, తగిన నిర్ణయం మాత్రం తీసుకోలేదు.
ఇవీ చదవండి: