చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్ పేట దళిత వాడ గ్రామ మహిళా వాలంటీర్‌పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో అందరికీ ట్యాంకర్‌తో నీటిని అందించి తమ ఇంటికి మాత్రమే నీటిని సరఫరా చేయటం లేదు ఎందుకని ప్రశ్నించినందుకు... దాడికి పాల్పడ్డారని పోలీసులకు వాలంటీర్ ఫిర్యాదు చేశారు. కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడికి దిగి సామగ్రి ధ్వంసం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకూ తన కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయని... న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: 'విశాఖ పర్యటనకు చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం'